అఖిల్ సినిమా అయితే నాకేంటి..!

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని అడిగారట. మళయాళ ప్రేమం తో సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఎం.సి.ఏ కూడా హిట్ అవడంతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. 

తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నా తన పాత్ర నచ్చితేనే సినిమాలకు సైన్ చేస్తుంది సాయి పల్లవి. గీతా గోవిందం సినిమాలో ముందు సాయి పల్లవినే హీరోయిన్ గా అనుకున్నారట కాని ఆ సినిమా చేయలేదు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో హీరోయిన్ గా కూడా సాయి పల్లవిని అడిగారట. కాని అమ్మడు ఆ సినిమా ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది. ఇక ఇప్పుడు అఖిల్ సినిమాకు ముందు ఆమెను అడిగారట. అయితే డైరక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ ఆమెకు నచ్చలేదట. 

సినిమాలో హీరోయిన్ క్యారక్టరైజేషన్ కు పెద్దగా డిమాండ్ లేదని ఆ సినిమాను చేయనని చెప్పిందట. ఎవరైనా హీరోయిన్ గా చేయడానికి రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తారు కాని సాయి పల్లవి మాత్రం తను చేయాల్సిన పాత్ర వెయిట్ ఉండాలని అనుకుంటుంది. అందుకే అమ్మడు చాలా సినిమాలను మిస్ చేసుకుంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది.