సాహోకి సీక్వల్..?

సుజిత్ డైరక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన సినిమా సాహో. మరో 3 రోజుల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వారం నుండి బాలీవుడ్ లో ప్రభాస్ సాహో ప్రమోషన్స్ తో హంగామా చేశాడు. అయితే సాహో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని. ఆడియెన్స్ అందరికి నచ్చే సినిమా అవుతుందని అన్నారు. అసలైతే ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ లో పూర్తి చేయాలని అనుకోగా ఆ తర్వాత 350 కోట్ల దాకా పెట్టాల్సి వచ్చిందని అన్నారు. 

బాహుబలి తర్వాత చిన్న సినిమా చేద్దామని అనుకోగా సాహో అనుకోకుండా పెద్ద ప్రాజెక్ట్ అయ్యింది. మళ్లీ రెండు మూడేళ్ల దాకా ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు చేయనని చెప్పుకొచ్చాడు ప్రభాస్. అంతేకాదు సుజిత్ మైండ్ లో సాహో సీక్వల్ కథ కూడా ఉందని సాహో ఆశించిన స్థాయిని అందుకుంటే సాహో పార్ట్ 2 కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు ప్రభాస్. సాహో తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్న ప్రభాస్. ఆ సినిమా గురించి కూడా ప్రస్తావిస్తూ ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో టచ్ చేయని ఓ విషయం ఆ సినిమాలో ఉందని అంటున్నారు. మరి రాధాకృష్ణ జాన్ ఎలా ఉండబోతుందో చూడాలి.