
మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు. తమిళ, మళయాళంలో వరుస సినిమాలు చేస్తూ కెరియర్ లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ తెలుగులో చేస్తున్న సినిమా మిస్ ఇండియా. నరేంద్ర నాథ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. మిస్ ఇండియా టీజర్ చూస్తే సినిమా మొత్తం యూఎస్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతున్నట్టు ఉంది.
సినిమాలో కీర్తి సురేష్ అల్ట్రా మోడ్రెన్ లుక్ లో కనిపిస్తుంది. ఇక టీజర్ లో కథ రివీల్ చేయలేదు కాని మిస్ ఇండియా టైటిల్ లోగో దానికి తమన్ అందించిన మ్యూజిక్ మాత్రం అదరగొట్టాయి. సినిమాలో ఏదో విషయం ఉన్నట్టుగా తెలుస్తుంది. కీర్తి సురేష్ సోలోగా లీడ్ చేస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నదియాలు నటిస్తున్నారు. ఈ మూవీని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు.