రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్..!

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్టులు బయటకు వస్తున్నాయి. సోమవారం రాత్రి నార్సింగ్ ఏరియాలో రాజ్ తరుణ్ తన కారుని గోడకు తగిలించి యాక్సిడెంట్ చేశాడు. ఆ తర్వాత రెండు రోజులకు రాజ్ తరుణ్ తను సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల సేఫ్ అయినట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాదు యాక్సిడెంట్ టైంలో పెద్ద శబ్ధం కావడంతో తను పరుగెత్తుకుంటూ వెళ్లానని వీడియో మెసేజ్ పెట్టాడు.      

రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కు సంబందించిన ఫుటేజ్ కార్తిక్ అనే వ్యక్తి వీడియో తీశాడట. ఆ సమయంలో రాజ్ తరుణ్ తాగి ఉన్నాడని తనని వెంబడించి మరి అతన్ని తన ఇంటి వద్ద డ్రాప్ చేసి వచ్చానని కార్తిక్ చెబుతున్నాడు. అయితే ఈ వీడియో ఫుటేజ్ బయట పెట్టకుండా ఉండేందుకు కార్తిక్ రాజ్ తరుణ్ ను 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. రాజ్ తరుణ్ తరపున రంగంలోకి దిగిన తన మేనేజర్ రాజా రవింద్ర రివర్స్ లో కార్తిక్ తమ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. కార్తిక్ తమని డబ్బులు అడిగాడని.. 5 లక్షలు ఇవ్వకుంటే వీడియోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తామని అంటున్నాడని. యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడ నుండి పారిపోయినందుకు పోలీసులు రాజ్ తరుణ్ ను అరెస్ట్ చేశారు. అతని స్టేట్ మెంట్ తీసుకుని ఆ వెంటనే బెయిల్ మీద రిలీజ్ చేశారు. కార్తిక్ పై మాదాపూర్ పోలీసులు యాక్షన్ లోకి దిగుతారని తెలుస్తుంది.