కళ్యాణ్ రామ్ సినిమా కథ అదేనా..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న మరోసారి అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. 

అయితే ఈ సినిమా గుజరాతి సినిమాకు రీమేక్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గుజరాతిలో లాస్ట్ ఇయర్ వచ్చిన ఆక్సిజన్ సినిమాకు ఈ సినిమా కథ దగ్గర పోలికలు ఉన్నాయని తెలుస్తుంది. తన వాళ్లకు మాత్రమే కాదు తనకు తెలియని వారికి కూడా మంచి చేసే అతి మంచి వాడి కథే ఈ సినిమా అట. అయితే గుజరాతిలో ఆక్సిజన్ సినిమా కూడా ఇదే అని తెలుస్తుంది. అన్షుల్ త్రివేది హీరోగా.. చిన్మయ్ పురోహిత్ డైరక్షన్ లో వచ్చిన ఆక్సిజన్ గుజరాతిలో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ సినిమాలో రన్ టైం చాలా ఎక్కువ అని తెలుస్తుంది. మరి అసలు ఆ సినిమాకు రీమేక్ గానే కళ్యాణ్ రాం సినిమా వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సినిమా దర్శక నిర్మాతలు మాత్రం ఈ సినిమా రీమేక్ అన్న విషయాన్ని ఎక్కడ ప్రస్థావించలేదు.