తమిళ దర్శకుడితో మెగా హీరో

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ చిత్రలహరితో హిట్ ట్రాక్ ఎక్కాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సాయి ధరం తేజ్ కు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో ప్రతిరోజు పండుగే సినిమా చేస్తున్న సాయి ధరం తేజ్ తన తర్వాత సినిమా తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ టాలెంటెడ్ డైరక్టర్స్ లో ఒకరైన వెంకట్ ప్రభుతో సాయి ధరం తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.  

ఇప్పటికే దర్శకుడు సాయి తేజ్ కు కథ వినిపించడం అతను ఓకే చెప్పడం జరిగిందట. అనీల్ సుంకర నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. అజిత్ గ్యాంబ్లర్, సూర్య రాక్షసుడు సినిమాలు చేసిన వెంకట్ ప్రభు ప్రస్తుతం పార్టీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా క్రేజీ ప్రాజెక్ట్ మానాడు కూడా లైన్ లో ఉంది. సాయి ధరం తేజ్ సినిమాను బైలింగ్వల్ గా తీసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలా చేస్తే మెగా మేనళ్లుడు తమిళంలో రిలీజ్ చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది.