
ఈగ సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన సుదీప్ కన్నడలో స్టార్ హీరో. అక్కడ హీరోగా సత్తా చాటుతూనే ఇతర భాషల సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఈగలో విలన్ గా సక్సెస్ అవడంతో బాహుబలి ది బిగినింగ్ లో కూడా సుదీప్ కు ఛాన్స్ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి మూవీలో కూడా సుదీప్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కన్నడలో అతను నటించిన పహిల్వాన్ సినిమాను తెలుగులో రీలీజ్ చేస్తున్నారు.
కన్నడలో హెబ్బులితో సక్సెస్ అందుకున్న సుదీప్, కృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పహిల్వాన్. తెలుగులో వారాహి చలన చిత్ర ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసిందని చెప్పొచ్చు. సుదీప్ తో పాటుగా ఈ సినిమాలో బాలీవుడ్ సునీల్ శెట్టి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సెప్టెబర్ 12న రిలీజ్ అవనున్న పహిల్వాన్ తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.