
ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూరి తన తర్వాత సినిమా పనులు మొదలుపెట్టాడు. పూరి డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా వస్తుంది. ఈ సినిమాను కూడా పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రౌడీ హీరో ఇమేజ్ కు తగినట్టుగా పూరి అదిరిపోయే కథ సిద్ధం చేశాడట. ఇక కథ ప్రకారం ఈ సినిమాకు టైటిల్ ఫైటర్ అన్నది పర్ఫెక్ట్ అట.
నిర్మాత ఛార్మి ఫైటర్ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి విజయ్ దేవరకొండతో కూడా మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడని తెలుస్తుంది. టెంపర్ తర్వాత పూరి ఐదు సినిమాలు చేసినా అవేవి వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా ఇస్మార్ట్ హిట్ తో పూరి మళ్లీ ఫాంలోకి వచ్చినట్టే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఫైటర్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.