సైరాకు నయనతార బిగ్ హ్యాండ్

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతారకు అన్ని భాషల్లో సూపర్ క్రేజ్ ఉంది. కోలీవుడ్ లో ఆమెకు అక్కడ స్టార్ హీరోలకు సమానమైన ఇమేజ్ ఉంది. అందుకే తమిళంలో ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంటారు. ఒప్పుకున్న సినిమా కోసం ఎంత కష్టమైన పడే నయన్ సినిమా ప్రమోషన్స్ అంటే మాత్రం డుమ్మా కొడుతుంది. నయనతారకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని తెలుగు సీనియర్ స్టార్స్ కూడా ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు.

లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ముంబైలో జరుగగా.. ఈవెంట్ కు సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన అందరు అటెండ్ అయ్యారు కాని నయనతార మాత్రం అటెండ్ అవలేదు. అన్ని సినిమాలు ఒక లెక్క సైరా సినిమా ఒక లెక్క. అలాంటి సైరా ప్రమోషన్స్ కు కూడా నయనతార అందుబాటులో ఉండడం లేదట. కనీసం సైరా తమిళ ప్రమోషన్స్ లో అయినా నయనతార వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సైరా సినిమా తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ భాషల్లో అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.