విశాల్ పెళ్లి క్యాన్సిల్ అవుతుందా..!

కోలీవుడ్ హీరో విశాల్ హైదరాబాద్ బిజినెస్ మెన్ కూతురు అనిషా రెడ్డితో నిశ్చితార్ధం జరుపుకున్నారు. మార్చి 10న వీరి ఎంగేజ్మెంట్ జరుగగా త్వరలో పెళ్లి డేట్ వస్తుందని ఆశించారు. కాని ఈలోగా ఏమైందో ఏమో తెలియదు కాని విశాల్, అనిషా తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ తర్వాత విశాల్, అనిషా ఇద్దరు టర్కీ ట్రిప్ వేసి వచ్చారు. అక్కడకు వెళ్లొచ్చిన తర్వాత నుండి ఇద్దరి మాట్లాడుకోవడం, కలవడం జరగట్లేదట.

ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లి క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే విశాల్, అనిషా ఎందుకు విడిపోతున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఈమధ్య కోలీవుడ్ లో విశాల్ మీద చాలా వ్యతిరేకత ఎదురైంది. నిర్మాతల మండలి గొడవతో పాటుగా నడిగర్ సంఘం ఎలక్షన్స్ కూడా అతన్ని విలన్ గా ప్రమోట్ చేశాయి. మరి నిజంగ విశాల్, అనిషా పెళ్లు రద్ధవుతుందా లేదా అన్నది అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.