
యువ హీరో నితిన్ ఛలో సినిమా డైరక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా భీష్మ. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అసలైతే ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని చూశారు. కాని సినిమా ఎనౌన్స్ మెంట్ కు కొద్దిరోజులు ఆ తర్వాత సెట్స్ మీదకు వెళ్లేందుకు మరికొద్దిరోజులు టైం తీసుకుంది.
అందుకే భీష్మ సినిమా ఈ ఇయర్ రిలీజ్ చేయడం కష్టమని తెలుస్తుంది. 2020 జనవరిలో పెద్ద సినిమాలన్ని క్యూలో ఉన్నాయి. అందుకే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో భీష్మ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. వెంకీ కుడుముల ఛలో సినిమా 2018 ఫిబ్రవరిలోనే రిలీజైంది. అదే సెంటిమెంట్ తో భీష్మని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. శ్రీనివాస కళ్యాణం తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన నితిన్ వెంకీ కుడుములతో భీష్మ.. వెంకీ అట్లూరితో రంగ్ దే.. చంద్రశేఖర్ యేలేటితో సినిమా లైన్ లో పెట్టాడు. ఈ ఇయర్ మిస్సైనా 2020లో నితిన్ కనీసం రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడని తెలుస్తుంది.