అనుష్కని పెళ్లి చేసుకోమని అడుగుతా..!

స్వీటీ అనుష్క, ప్రభాస్ ల మధ్య పెళ్లి రూమర్స్ ఎప్పటికి ఆగేలా లేవు. ప్రస్తుతం సాహో ప్రమోషన్స్ లో ఉన్న ప్రభాస్ తో అనుష్క గురించి అడగడం.. ప్రభాస్ తనతో ఎలాంటి రిలేషన్ చెప్పడం ఇది రొటీన్ గా మారింది. అయితే ఈరోజు ప్రమోషన్స్ లో కూడా ఓ ఆంగ్ల పత్రిక అనుష్క గురించి ప్రశ్న అడిగితే ఈసారి అనుష్క కలిస్తే నువ్వైనా త్వరగా పెళ్లి చేసుకో అని చెబుతా అన్నాడు ప్రభాస్.

ముందు నేనైనా పెళ్లి చేసుకోవాలి.. లేదా అనుష్క అయినా వేరే వ్యక్తిని పెళ్లాడాలి. అలా అయితే తప్ప ఈ వార్తలకు బ్రేక్ పడేట్టు లేవని అన్నారు ప్రభాస్. ఒకవేళ మేమ్ము నిజంగా రిలేషన్ లో ఉంటే దాచుకోవాల్సిన అవసరం ఏముందో తనకు అర్ధం కావట్లేదని అన్నారు ప్రభాస్. ఈ వార్తలను భరించలేక సాహో తర్వాత ప్రభాస్ తప్పనిసరిగా ఓ ఇంటి వాడు అయ్యేలా కనిపిస్తున్నాడు.