సాహో సెన్సార్ పూర్తి..!

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 2 గంటల 50 నిమిషాల రన్ టైం తో సాహో సినిమా వస్తుంది. ఇక సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ అందించడం విశేషం. అంతేకాదు సినిమా చూసి సెన్సార్ వాళ్లు చిత్రయూనిట్ ను మెచ్చుకున్నారట.   

ప్రస్తుతం నేషనల్ వైడ్ గా సాహో ఫీవర్ ఉందని చెప్పొచ్చు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ ఈ సినిమా నిర్మించారు. రీసెంట్ గా హైదరాబాద్ ఆరెఫ్సి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సాహో టీం ప్రస్తుతం సినిమాను బాలీవ్డ్ లో ప్రమోట్ చేసేందుకు ముంబై వెళ్లారు. సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఫీమేల్ లీడ్ గా నటించగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.