వాల్మీకి టీజర్.. నా విలనే నా హీరో..!

మెగా హీరోల్లో రొటీన్ కు భిన్నంగా కొత్త ప్రయోగాలతో వస్తున్నాడు వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ మొదట్లో కమర్షియల్ హిట్లు అందుకోకున్నా కంచెతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఫిదా, తొలిప్రేమ, ఎఫ్-2 సినిమాలతో వరుణ్ తేజ్ కెరియర్ సెట్ రైట్ చేసుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న క్రేజీ మూవీ వాల్మీకి. కోలీవుడ్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ చేస్తున్నాడు.     

హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది. టీజర్ చూస్తే వరుణ్ తేజ్ లో ఎప్పుడు చూడని యాంగిల్ ఒకటి ఉందని తెలుస్తుంది. నెగటివ్ రోల్ లో పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేశాడు వరుణ్ తేజ్. సినిమాలో అధర్వ మరో హీరోగా నటిస్తున్నాడు. అతను సినిమాలో ఫిల్మ్ మేకర్ గా కనిపిస్తున్నాడు. నా హీరోనే నా విలన్ అనే డైలాగ్ అలరించగా.. అందుకే పెద్దోళ్లు చెప్పిర్రు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే, రెండు కాల్చుకోవాలి.. రెండు దాచుకోవాలి అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ అలరించింది. సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై టీజర్ అంచనాలు పెంచేసిందని చెప్పొచ్చు.