
మాటల మాంత్రికుడు త్రివిక్రం.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమాకు అల వైకుంఠపురములో టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన చిన్న టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. అల.. వైకుంఠపురములో త్రివిక్రం మార్క్ మూవీగా వస్తుందని ఈ టీజర్ చూసి చెప్పొచ్చు.
తండ్రి కొడుకుల సెంటిమెంట్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో బన్ని ఫాదర్ గా మురళి శర్మ నటిస్తున్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచాడు త్రివిక్రం. మరోసారి తన పెన్ పవర్ ఏంటో చూపించేలా ఉన్నాడని టీజర్ చూస్తేనే తెలుస్తుంది.
లాస్ట్ ఇయర్ అరవింద సమేత సినిమాతో హిట్ అందుకున్న త్రివిక్రం శ్రీనివాస్ అల.. వైకుంఠపురములో సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో బన్నితో పాటుగా సుశాంత్, నవదీప్ లు కూడా నటిస్తున్నారు. నివేదా పేతురాజ్ కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది.
ఈరోజు వచ్చిన టీజర్ చూసిన ఎవరైనా మరోసారి త్రివిక్రం మనసుకి హత్తుకునే సినిమాను ఇస్తాడని ఫిక్స్ అయ్యారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని తెలుస్తుంది. 2020 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రం అ సెంటిమెంట్ తో వస్తున్న అల వైకుంఠపురంలో సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.