సైరా మేకింగ్ వీడియో.. బాక్సులు బద్ధలవడం ఖాయం..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచిన సైరా సినిమా ఇప్పుడు మేకింగ్ వీడియోతో ఆడియెన్స్ ను మరోసార్ థ్రిల్ అయ్యేలా చేసింది.

పిరియాడికల్ మూవీగా వస్తున్న సైరా సినిమా మేకింగ్ వీడియో చూస్తే సినిమా మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచేలా సైరా నరసింహా రెడ్డి సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉన్నాడనిపిస్తుంది. విజువల్ గ్రాండియర్ గా రాబోతున్న సైరా సినిమా టీజర్ ఈ నెల 20 చిరు బర్త్ డే కానుకగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మేకింగ్ వీడియో మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.