
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇంతవరకు మాస్, రొమాంటిక్ హీరో పాత్రలే ఎక్కువగా చేసేవాడు కనుక అందుకు తగ్గట్లుగానే కనిపించేవాడు. కానీ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో చాలా రఫ్ అండ్ టఫ్ పాత్ర చేసి అందరినీ మెప్పించాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరీకి మళ్ళీ సెకండ్ లైఫ్ ఇస్తే, రామ్ కెరీర్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి, 75 కోట్లు వసూలు చేసి ఒక సరికొత్త రికార్డు నెలకొల్పింది. సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం క్లాస్ అండ్ మాస్ అన్ని వర్గాలను ఆకట్టుకొంటుండటంతో నేటికీ అన్ని ధియేటర్లలో హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి.
ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రమోషన్ ఫంక్షన్లకు టోపీ పెట్టుకొని వస్తున రామ్, ఈసారి పూర్తి డిఫరెంట్ గెటప్‌తో వచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. పూర్తిగా గుండు కొట్టించుకొని, ఫ్రెంచ్ కట్‌తో వచ్చిన రామ్‌ను ఒక క్షణం ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. గుర్తుపట్టాక అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతూ ఈలలు, చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్ కొత్త గెటప్ చూస్తే ‘హి ఈస్ డిఫరెంట్’ అని మీరు ఒప్పుకొంటారు. అయితే ఈ కొత్త గెటప్ ఏ సినిమా కోసం? ఏ పాత్ర కోసం? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.