జాతీయ ఉత్తమ నటి 'మహానటి'

మహానటి సావిత్రి బయోపిక్ గా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా మహానటి. వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించిన ఈ సినిమాకు స్వప్నా, ప్రియాంకా దత్ లు సహ నిర్మాతలుగా పనిచేశారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన నటన కనబరిచారు. మహానటి సినిమాకు ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు రాగా జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కు అవార్డ్ దక్కింది.     

66వ జాతీయ అవార్డులను ఈరోజు ప్రకటించడం జరిగింది. మహానటి సినిమా కూడా తెలుగు ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ గా కూడా ఈ సినిమాకు మరో అవార్డ్ వచ్చింది. మొత్తానికి 2018లో మే 9న రిలీజైన మహానటి సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలవడంతో పాటుగా జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.