
ఒకప్పటి తారామణులంతా మళ్లీ తెలుగు తెర మీద కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో కొందరు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న వారు ఉండగా కొందరు తెలుగులో చాలా గ్యాప్ ఇచ్చిన వారు ఉన్నారు. హీరోయిన్ గా కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న విజయశాంతి చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే లేటెస్ట్ గా అనీల్ రావిపుడి డైరక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి నటిస్తుందని తెలిసిందే.
తెలుగులో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిన హీరోయిన్ టబు. అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తున్నా ఈమధ్య కాలంలో ఆమె తెలుగులో ఏ సినిమా చేయలేదు. లేటెస్ట్ గా త్రివిక్రం డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమాలో టబు నటిస్తుందని తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా రానా, సాయి పల్లవి లీడ్ రోల్స్ చేస్తున్న విరాటపర్వం సినిమాకి టబు సైన్ చేసింది. అయితే విరాటపర్వం సినిమా షూటింగ్ లేటవుతున్న కారణంగా తనకు ఉన్న బాలీవుడ్ కమిట్మెంట్స్ కోసమని విరాటపర్వం నుండి బయటకు వచ్చేసిందట టబు.
నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న వేణు ఊడుగుల డైరక్షన్ లో విరాటపర్వం తెరకెక్కుతుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.