నాని వాయిదా వేయక తప్పలేదు..!

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అసలైతే ఆగష్టు 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను 30కి వాయిదా వేశారు. అయితే అనుకోకుండా సాహో ఆగష్టు 30న వస్తుందని తెలియడంతో సాహో తాకిడి ముందు నిలబడటం కష్టమని గ్యాంగ్ లీడర్ సినిమాను మరోసారి వాయిదా వేశారు.   

ఫైనల్ గా సెప్టెంబర్ 13న సాహో రిలీజ్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ లో సినిమాల సందడి బాగానే ఉంది. ఇప్పటికే సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ వాల్మికి రిలీజ్ ప్లాన్ చేశారు. అదేరోజు గ్యాంగ్ లీడర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆగష్టు 30 తర్వాత రెండు వారాల వరకు సాహోకి వదిలేయడం విశేషం. మరి సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ తో పోటీ పడుతున్న గ్యాంగ్ లీడర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.