
సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ రావిపుడి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న మహేష్ సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్ హిట్ పై కన్నేశాడు. ఈరోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
నిమిషం నిడివి కన్నా తక్కువ ఉన్న ఈ టీజర్ లో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించాడు. తన లుక్స్ తో ఎప్పుడూ సర్ ప్రైజ్ ఇచ్చే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమలో ఆర్మీ ఆఫీసర్ గా అదరగొట్టాడు. టీజర్ ఘట్టమనేని ఫ్యాన్స్ అందరికి నచ్చేసింది. సూపర్ స్టార్ బర్త్ డేకి సూపర్ సర్ ప్రైజ్ అందుకున్న మహేష్ ఫ్యాన్స్ 2020 సంక్రాంతికి హంగామా చేసేందుకు రెడీ అంటున్నారు. మరి సరిలేరు నీకెవ్వరు రికార్డుల్లో కూడా సరిలేరు ఇంకెవ్వరు అనేలా అనిపించుకుంటాడో లేదో చూడాలి.