విజయ్ దేవరకొండ వల్లో పడ్డ ప్రియా ప్రకాశ్

విజయ్ దేవరకొండ కేవలం తెలుగు హీరో అనడం కష్టమే.. అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో ఈమధ్య వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీ సినిమాను సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేసి సత్తా చాటాడు. డియర్ కామ్రేడ్ సినిమా ఫలితం ఎలా ఉన్నా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో విజయ్ దేవరకొండకు కొంత క్రేజ్ వచ్చింది. ఇక ఆ క్రేజ్ తోనే తెలుగు భామలకే కాకుండా మళయాళ హీరోయిన్స్ కు విజయ్ నచ్చేస్తున్నాడు. 

ఈ క్రమంలోనే ఒరు ఆధార్ లవ్ టీజర్ తో సూపర్ ఫేమస్ అయిన ప్రియా ప్రకాశ్ కూడా విజయ్ వల్లో పడింది. విజయ్ దేవరకొండతో ప్రియా ప్రకాశ్ దిగిన పిక్ షేర్ చేస్తూ నువ్వు అంటే నాకు చాలా ఇష్టమని కామెంట్ పెట్టింది. వింక్ బ్యూటీతో విజయ్ దేవరకొండ అంటూ ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు ఎక్కడ కలిశారో తెలియదు కాని విజయ్, ప్రియా ప్రకాశ్ ల జోడీ మాత్రం అదిరిపోయింది. మరి ఇంకేం ఈ జోడీని పెట్టి సినిమా తీసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధం కావడమే తరువాయి.