రానా అమెరికా ఎందుకెళ్లాడు..?

టాలీవుడ్ లో ఏ హీరో మీద రానన్ని రూమర్స్ రానా మీద వస్తాయి. ఎప్పుడు రానా మీద ఫోకస్ గా ఉండటంతో పాటుగా కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా అతనికి సూపర్ క్రేజ్ ఉండటమే దీనికి కారణమని చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా రానా అమెరికాకు వెళ్లడంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. రానాకు కిడ్నీ మార్పిడి కోసమే అమెరికాకు వెళ్లాడని.. అతనికి తన తల్లి లక్ష్మి దగ్గుబాటి కిడ్నీ దానం చేశారని వార్తలు వస్తున్నాయి.

అయితే వీటిపై స్పందించడం కూడా ఇష్టపడని రానా ఫైనల్ గా తన మీద తన ఆరోగ్యం మీద మీరు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్. నా ఆరోగ్యం పై వార్తలు వచ్చిన ప్రతిసారి తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పడం అలవాటుగా మారింది. అందుకే ఈ వార్తలు తనకు బోరింగ్ గా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. గుణశేఖర్ తో తీసే హిర్యణ్యకశ్యప సినిమా విజువలైజేషన్ కాన్సెప్ట్ గురించి వి.ఎఫ్.ఎక్స్ కంపెనీలతో మాట్లాడేందుకే తను అమెరికాకు వెళ్లానని అంటున్నాడు రానా. మరి ఇప్పటికైనా రానా ఆరోగ్యంపై వార్తలు ఆగుతాయో లేదో చూడాలి.