మహానటి దర్శకుడు మరో మహా మూవీ..!

మహానటి సావిత్రి బయోపిక్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా అతని సత్తా చాటింది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు. లేటెస్ట్ గా అతను ఓ భారీ మూవీకి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అందుకోసం ఓ ప్రకటన చేశారు నాగ్ అశ్విన్ అండ్ టీం. త్వరలో మొదలు కాబోతున్న వారి సినిమాకు విజువల్ ఆర్టిస్టులు, డిజైనర్స్, రైటర్స్ కావలని సెప్టెంబర్ లో సాహసం మొదలవుతుందని ప్రకటన ఇచ్చారు.  

మహానటి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న నాగ్ అశ్విన్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. మరి విజువల్ ఎఫెక్ట్స్ అంటున్నాడు అంటే ఈసారి నాగ్ పిరియాడికల్ మూవీ ఏదైనా తీస్తున్నాడా అన్న డౌట్లు మొదలయ్యాయి. నిర్మాత అశ్వనిదత్ కాబట్టి సినిమా తప్పకుండా భారీ స్కేల్ లోనే ఉంటుంది. ఇంతకీ ఈ భారీ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ఎవరు.. ఈసారి నాగ్ అశ్విన్ ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తాడు అన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.