
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సుకుమార్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆర్య, ఆర్య 2 సినిమాలతో సూపర్ కాంబోగా నిలిచిన సుకుమార్, బన్ని హ్యాట్రిక్ మూవీగా ఎలాంటి సినిమా చేస్తారో అని ఆడియెన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు.
అయితే ఇది లవ్ స్టోరీ మాత్రం కాదని తెలుస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా సుక్కు, బన్ని సినిమా వస్తుందట. మహేష్ కోసం రాసుకున్న కథతోనే సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఛలో, గీతా గోవిందం సినిమాల హిట్స్ అందుకున్న రష్మిక దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలతో అంచనాలను అందుకోలేదు. అయినా సరే యూత్ లో అమ్మడికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో జోడీ కడుతున్న రష్మిక బన్నితో కూడా లక్కీ ఛాన్స్ అందుకుంది. వీళ్లిద్దరు ఛాన్స్ ఇచ్చారంటే ఇక మిగతా స్టార్స్ కూడా ఆమెను హీరోయిన్ గా ఎంచుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా రష్మికకు తెలుగు పరిశ్రమ బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సుకుమార్ సినిమాతో పాటుగా బన్ని, వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఆ సినిమా 2019 చివరలో సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.