
కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో సూపర్ హిట్ మూవీ సీక్వల్ గా వస్తున్న సినిమా మన్మథుడు-2. మన్మథుడుకి ఈ సినిమాకు కథ విషయంలో ఎలాంటి సంబంధం లేదు కాని ఆ సినిమాలానే ఇది కూడా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా వస్తుంది. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన మన్మథుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన్మథుడు సినిమా గురించి ప్రస్థావించిన నాగార్జున డైరక్టర్ విజయ్ భాస్కర్, మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ల గురించి పొగిడాడు.
మాటవరసకి కూడా త్రివిక్రం శ్రీనివాస్ పేరు ఎత్తలేదు. అదేదో పొరపాటు జరిగింది అనుకున్నారు ప్రేక్షకులు. కాని మన్మథుడు 2 ప్రమోషన్స్ లో కూడా నాగార్జున త్రివిక్రం పేరు ప్రస్థావిస్తే చాలు మాట దాటేస్తున్నారు. అసలు త్రివిక్రమే మన్మథుడు సినిమాకు రైటర్ అలాంటిది నాగ్ ఎలా మర్చిపోయాడని డౌట్ పడుతున్నారు. ఇంటర్వ్యూస్ లో ఆ ప్రశ్న అడిగితే డైరక్టర్ విజయ్ భాస్కరే తనకు ఆ పంచులు చెప్పాడని అందుకే అతని పేరే చెప్పానని వాట్ నెక్స్ట్ అన్నారు నాగ్. సో త్రివిక్రం విషయంలో నాగార్జున ఎక్కడో బాగా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది. మరి ఆ రహస్యం ఏంటో తెలియాల్సి ఉంది.