
ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఆగష్టు 30న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ట్రైలర్ 10వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు ప్రాంతాల్లో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుందట.
ముందుగా ఆగష్టు 10న ముంబైలో సాహో ట్రైలర్ లాంచ్ చేస్తారని తెలుస్తుంది. 11న హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ చేసిన్ చేసి మీడియాతో ఇంటరాక్షన్ ఉంటుందని తెలుస్తుంది. 12న చెన్నైలో ఈవెంట్ ప్లాన్ చేయగా.. 13న కొచ్చిలో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేశారట. 14న న్యూ ఢిల్లిలో సాహో ఈవెంట్ ఉంటుందట. ఇలా దేశమంతా భారీ స్థాయిలో సాహో ఈవెంట్ ప్లాన్ చేశారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కాబట్టి సినిమా గురించి ఆడియెన్స్ కూడా అంతే ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.