
నాచురల్ స్టార్ నాని ఈ ఇయర్ జెర్సీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం విక్రం కె కుమార్ డైరక్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నాడు నాని. ఈ నెల చివరన కాని సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో 'వి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో కనిపిస్తాడని తెలిసిందే.
'వి' మూవీలో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. సుధీర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. మూవీలో నాని నెగటివ్ రోల్ చేస్తున్నా ఆ పాత్ర కోసం సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేస్తున్నాడట. నాచురల్ స్టార్ నాని సిక్స్ ప్యాక్ అబ్బో ఇదేదో కొత్తగా ఉందే అనుకోవచ్చు. పాత్ర కోసం ఎలాంటి రిక్సైనా చేసే నాని 'వి' సినిమా కోసం నిజంగానే కొత్తగా ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాకు మరో స్పెషల్ ఏంటంటే నానికి ఇది 25వ సినిమా అవడం విశేషం. మరి మైల్ స్టోన్ మూవీ నానికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.