కాంట్రవర్సీల 'కోమాలి'

జయం రవి హీరోగా ప్రదీప్ రంగనాథన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కోమాలి. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరో జయం రవి ఫ్రెండ్ గా యోగి బాబు ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశాడు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సూపర్ కామెడీ అనుకున్నారు. కాని రజిని ఫ్యాన్స్ మాత్రం కోమాలి ట్రైలర్ పై ఫైర్ అవుతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ హీరో కోమాలో 16 ఏళ్లు ఉండి బయటపడతాడు.

కోమాలో నుండి బయటకు వచ్చిన హీరో.. ప్రపంచం మొత్తం మారిపోవడాన్ని గుర్తిస్తాడు. అయితే తన స్నేహితులు చెబుతున్న విషయం ముందు ఒప్పుకోని హీరో టివిలో రజిని తాను త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం చూపిస్తారు. అది 2016 కాదని 1996 అని అంటాడు హీరో జయం రవి. అది కాస్త రజిని ఫ్యాన్స్ కు నచ్చలేదు. రజినికాంత్ పాలిటిక్స్ లోకి వస్తానని చెప్పడమే తప్ప రావట్లేదని సెటైర్ వేశారని సినిమా చూడకుండా బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు రజిని ఫ్యాన్స్. అయితే వెంటనే ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పి ఆ సీన్ సినిమాలో నుండి కట్ చేస్తున్నట్టు ప్రకటించారు కోమాలి చిత్రయూనిట్. ట్రైలర్ తో మెప్పించిన కోమాలి సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను నవ్విస్తుందో చూడాలి.       

కోమాలి ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి..