సునీల్ ప్లేస్ లో అతనొచ్చాడా..!

డైరక్టర్ త్రివిక్రం కమెడియన్ కమ్ హీరో సునీల్ మంచి స్నేహితులని తెలిసిందే. కమెడియన్ గా మంచి ఫాంలో ఉన్న టైంలో హీరోగా మారిన సునీల్ కొన్నాళ్లు కష్టపడ్డా ఫలితం లేకపోవడంతో మళ్లీ కమెడియన్ గానే బెస్ట్ అనుకున్నాడు. అరవింద సమేతతో త్రివిక్రమే మళ్లీ సునీల్ కు ఫ్రెండ్ క్యారక్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత చిత్రలహరి సినిమాలో కూడా సాయి ధరం తేజ్ కు గ్లాస్ మెట్ గా నటించాడు సునీల్. ఇదిలాఉంటే స్నేహితుడి కెరియర్ సెట్ చేసే బాధ్యత మీద వేసుకున్న త్రివిక్రం ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాలో కూడా ఓ పాత్ర ఇచ్చాడట.

కాని ఏమైందో ఏమో ఇప్పుడు ఆ పాత్రలో సునీల్ ప్లేస్ లో వెన్నెల కిశోర్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఫ్రెండ్ అని తాను సునీల్ కు ఇచ్చేందుకు సిద్ధమైనా ఆ క్యారక్టర్ లో సునీల్ కన్నా వెన్నెల కిశోర్ అయితేనే బెటర్ అని త్రివిక్రం భావించాడట. అందుకే సునీల్ కు హ్యాండ్ ఇచ్చాడట. అంతేకాదు ఈ సినిమాలో రావు రమేష్ కూడా నటించడం లేదని తెలుస్తుంది. త్రివిక్రం సినిమాల్లో రావు రమేష్ కు ప్రత్యేక పాత్ర ఉంటుంది. మరి అలాంటిది త్రివిక్రం ఈసారి తన పంథా మార్చేస్తున్నాడు. నాన్న నేను టైటిల్ తో వస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు.