
కంగనా రనౌత్ లీడ్ రోల్ లో బాలీవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన సినిమా క్వీన్. ఆ సినిమాను సౌత్ అన్ని భాషల్లో రీమేక్ చేశారు. మిగతా భాషల్లో ఏమో కాని తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమాలు రిలీజ్ కు నోచుకోలేదు. తెలుగులో క్వీన్ రీమేక్ గా దటీజ్ మహాలక్ష్మి సినిమా చేశారు. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవలేదు. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా అసలు రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియదు.
ఇక తమిళ క్వీన్ సినిమా ప్యారిస్ ప్యారిస్ లో కాజల్ హీరోయిన్ గా నటించింది. రమేష్ అరవింద్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. టీజర్ లో కాజల్ స్నేహితురాలు ఓ సీన్ లో కాజల్ బ్రెస్ట్ ప్రెస్ చేస్తుంది. ఆ సన్నివేశం తెలుగులో లేదు. అందుకే తెలుగు క్వీన్ టీజర్ కన్నా తమిళ క్వీన్ ప్యారిస్ ప్యారిస్ టీజర్ కు ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అయితే సినిమా రిలీజ్ కోసం సెన్సార్ కు పంపించగా సెన్సార్ షాక్ అయ్యేలా సీన్స్ ఉన్నాయట.
కొన్ని సీన్స్ తమిళ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయట. అందుకే అలాంటి సీన్స్ అన్నిటిని కత్తెర వేస్తున్నారట. ప్యారిస్ ప్యారిస్ దర్శక నిర్మాతలు మాత్రం సెన్సార్ వాళ్లను కన్విన్స్ చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి కెరియర్ కాస్త వెనుకపడ్డట్టు అనిపించగానే కాజల్ ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని తెలుస్తుంది. మొత్తం సీన్స్ కట్ చేస్తే సినిమాపై ఇంప్యాక్ట్ పోతుందని ప్యారిస్ ప్యారిస్ దర్శక నిర్మాతలు సెన్సార్ వాళ్లతో మాట్లాడుతున్నారట. మరి ప్యారిస్ ప్యారిస్ ఎలా ఉండబోతుందో చూడాలి.