బాలకృష్ణ 'లాయర్ సాబ్'

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ ఆల్రెడీ తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు తెలుగు రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందట. రీసెంట్ గా దిల్ రాజు లాయర్ సాబ్ టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నందమూరి బాలకృష్ణ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. 

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో 100 సినిమాలు పూర్తి చేసుకున్న బాలకృష్ణ అప్పటి నుండి సినిమాల వేగం పెంచాడు. ప్రస్తుతం కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న బాలయ్య బాబు దిల్ రాజు బ్యానర్ లో పింక్ రీమేక్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. మరి పింక్ రీమేక్ తెలుగు దర్శకుడు ఎవరు, హీరోయిన్ మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి వివరాలు బయటకు రావాల్సి ఉంది.