
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న సాహో సినిమా ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటని తెలిసిందే. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమాను ఆగష్టు 30న గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేశారు. 250 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 350 నుండి 400 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే భారీ బిజినెస్ జరిగిందట.
వరల్డ్ వైడ్ గా ఈ సినిమా భారీగా రిలీజ్ అవుతుంది. అందుకే ఎక్కువ థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే స్టార్ సినిమా అంటే ప్రీమియర్స్ నుండి కలక్షన్స్ హంగామా ఉంటుంది. అందుకే సాహోకి కూడా ఫస్ట్ డే కలక్షన్స్ భారీగా ప్లాన్ చేశారట. మొదటి రోజు తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 100 కోట్ల పైగా వసూళ్లు రాబట్టాలని చూస్తున్నారట. రిలీజ్ రోజు ఆంధ్రా, తెలంగాణా మేజర్ సిటీస్ అన్నిటిలో ఈ సినిమానే ఆడేలా చూస్తునారట. మొత్తానికి సాహో టార్గెట్ పెద్దదే దాన్ని రీచ్ అయ్యే కంటెంట్ ఉందా లేదా అన్నది తెలియాలంటే ఈ నెల చివర దాకా ఆగాల్సిందే.