ఆ తమన్నా వల్ల ఈ తమన్నాని ఏసుకుంటున్నారు..!

బిగ్ బాస్ సీజన్ 3లో మొదటి వారం హేమ ఎలిమినేట్ అవగానే సర్ ప్రైజింగ్ గా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిని హౌజ్ లోకి పంపించారు బిగ్ బాస్ నిర్వాహకులు. మొదట్లో ఇంటి సభ్యులతో కలిసినట్టు కనిపించినా రాను రాను ఆమె ప్రవర్తన ఇంటి సభ్యులను ఇబ్బంది పెడుతుంది. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో రవి కృష్ణని దారుణంగా ఎటాక్ చేసింది తమన్నా సింహాద్రి. ఈ వారం నామినేషన్ లో ఆమె ఉంది. అందుకే తప్పకుండా ఆమెనే ఆడియెన్స్ బయటకు పంపిస్తారని అంటున్నారు.       

తమన్నా సింహాద్రి చేస్తున్న ఈ పనికి హీరోయిన్ తమన్నా మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆమెను ఎటాక్ చేసేందుకు తమన్నా ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారట. అతి దారుణంగా ఆ కామెంట్స్ ఉన్నాయని ఫీల్ అవుతుందట హీరోయిన్ తమన్నా. పేర్లు ఒకటే అయ్యే సరికి ఆమెకు తమన్నా సింహాద్రిని ట్యాగ్ చేయాల్సింది హీరోయిన్ తమన్నాని ట్యాగ్ చేసి దారుణంగా తిడుతున్నారట. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న తమన్నా ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందట.