
టెంపర్ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాలైతే చేశాడు కాని అందుకు తగినట్టుగా హిట్ అందుకోలేదు. రీసెంట్ గా వచ్చిన రామ్ ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టాడు. పూరి టేకింగ్, రామ్ యాక్టింగ్ రెండు కలిసి సినిమా అదిరిపోయే హిట్ అయ్యేలా చేశాయి. హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్ షో కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న పూరి వెంటనే డబుల్ ఇస్మార్ట్ శంకర్ టైటిల్ రిజిస్టర్ చేయించాడు.
వెంటనే ఆ సినిమా చేస్తాడని అనుకున్నారు కాని డబుల్ ఇస్మార్ట్ శంకర్ కు కాస్త టైం ఉందని తెలుస్తుంది. ఈలోగా విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చూస్తున్నాడు పూరి. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా డియర్ కామ్రేడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ పూరితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తారని అంటున్నారు. ఛార్మి కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుందని తెలుస్తుంది. మరి పూరి, విజయ్ కాంబో మూవీ ఎలా ఉంటుందో చూడాలి.