ఎవర్ గ్రీన్ మెగాస్టార్

కుర్రాళ్లకు ధీటుగా టాలీవుడ్ సీనియర్ స్టార్స్ షాక్ ఇస్తున్నారు. టాలీవుడ్ నాలుగు స్థంభాలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు మొన్నటిదాకా రేసులో వెనుకపడినట్టు అనిపించగా ఇప్పుడు మళ్లీ ఆ సీనియర్ స్టార్స్ వరుస సినిమాలు చేస్తున్నారు. పదేళ్ల గ్యాప్ ఇచ్చి వచ్చిన చిరు తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఖైది నంబర్ 150 తో ప్రూవ్ అయ్యింది. ఇక బాలకృష్ణ కూడా 100వ సినిమా తర్వాత వేగం పంచాడు.    

వెంకటేష్ ఈమధ్య కాస్త వెనుకపడినట్టు అనిపించగా ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఎఫ్-2తో వెంకీ కూడా ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు. ఇక కింగ్ నాగార్జున ఎవర్గ్రీన్ అన్నట్టుగా బ్రేక్ ఇవ్వకుండా.. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. తనయులు హీరోలుగా చేస్తున్నా సరే ఈ సీనియర్ స్టార్స్ తమ లుక్స్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా చిరు న్యూ లుక్ మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. 

మెగా కోడలు ఉపాసన ఎడిటర్ గా వస్తున్న బీ పాజిటివ్ మేగజైన్ కోసం చిరు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఆ మేగజైన్ కవర్ ఫోటో కోసం చిరుని ఫోటో షూట్ చేశారు. వయసు పెరిగినా వన్నె తగ్గలేదు అన్నట్టుగా చిరు స్టైల్ అదిరిపోయింది. ప్రస్తుతం చిరు లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేటితరం స్టార్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా చిరు లుక్ ఉంది.