మహేష్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుందా..!

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఆగష్టు 9 మహేష్ బర్త్ డే నాడు సరిలేరు నీకెవ్వరు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్.

తన బర్త్ డే కి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు మహేష్. సినిమా అనుకున్న విధంగా షూటింగ్ జరుపుకుంటుండగా సినిమా గురించి అనీల్ రావిపుడి ఇస్తున్న అప్డేట్స్ ఇంకాస్త అంచనాలు పెంచేస్తున్నారు. మహర్షి తో సూపర్ సక్సెస్ అందుకున్న మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తుండగా మూవీలో విజయశాంతి కూడా స్పెషల్ రోల్ లో నటిస్తుందని తెలిసిందే.