
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా రణరంగం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకినాడలో జరిగింది. ఈవెంట్ లో భాగంగా రణరంగం ట్రైలర్ రిలీజ్ చేశారు. టీజర్ తోనే ఇంప్రెస్ చేసిన రణరంగం ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.
ప్రేమకథగా మొదలైన ఈ సినిమా రణరంగంగా ఎలా మారింది అన్నది సినిమా కథ. శర్వానంద్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో లుక్స్ వైజ్ బాగా సెట్ అయ్యాడు. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ పిల్లై మ్యూజిక్ అందిస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాకు పోటీగా అడివి శేష్ ఎవరు వస్తుంది. రణరంగం, ఎవరు రెండు సినిమాల ట్రైలర్స్ బాగున్నాయి. మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.