'ఎవరు' ట్రైలర్.. అడివి శేష్ మరో క్రేజీ అటెంప్ట్..!

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న హీరో అడివి శేష్. క్షణం నుండి అతని సినిమాల మీద ఆడియెన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. లాస్ట్ ఇయర్ వచ్చిన గూఢచారి సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. బడ్జెట్ తక్కువే అయినా ఆడియెన్స్ కు కావాల్సిన థ్రిల్ కలిగించడంలో సక్సెస్ అవుతున్నడు అడివి శేష్. ప్రస్తుతం అతను హీరోగా వస్తున్న సినిమా ఎవరు. పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాను వెంకట్ రాంజి నిర్మిస్తున్నారు.

ఎవరు ట్రైలర్ చూస్తే సినిమాపై అంచనాలు పెంచింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన కంటెంట్ తోనే వస్తున్నారనిపిస్తుంది. రెజినా ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర కూడా నటిస్తున్నాడు. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా క్షణం, గూఢచారి సినిమాల ఫలితాన్నే రిపీట్ చేసేలా ఉంది. ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమాతో అడివి శేష్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.