
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఏ సినిమా చేస్తాడు. రాజమౌళి డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో తారక్ తో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్నారు. 2020 జూలై 30న రిలీజ్ ప్లాన్ చేసిన ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత తారక్ మరోసారి త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.
అరవింద సమేత తర్వాత మరోసారి త్రివిక్రం, తారక్ కలిసి సినిమా చేస్తున్నారట. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ఇద్దరు కలిసి ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ త్రివిక్రం లైన్ చెప్పడం దానికి తారక్ ఓకే చెప్పడం జరిగిందట. కె.జి.ఎఫ్ ప్రశాంత్ నీల్ కూడా తారక్ కోసం కథ రెడీ చేశాడట. అయితే అతన్ని మాత్రం 2020 సమ్మర్ తర్వాత కలవమని చెప్పాడట. మొత్తానికి ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కూడా క్రేజీ సినిమాలు క్యూలో పెట్టాడు.