నా వయసు 30.. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు..!

కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మన్మథుడు 2. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. 60 ఏళ్లకు దగ్గర పడుతున్న నాగార్జున తనకు కేవలం 30 ఏళ్లు మాత్రమే అని చెప్పడం విశేషం. ఇక తనకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని చెప్పుకొచ్చాడు. మన్మథుడు 2 ట్రైలర్ చూశాక అది నిజమే అని చెప్పక తప్పదు. ఈ వయసులో కూడా రొమాన్స్ కు, ముద్దులకు తాను సిద్ధమే అంటున్నాడు నాగార్జున.    

నాగార్జున మాటలను కొనసాగిస్తూ లుక్స్ విషయంలోనే కాదు కంటెంట్ లో కూడా నాన్న తమకు పోటీ ఇస్తున్నారని మాట్లాడాడు నాగ చైతన్య. ఈ టైంలో కూడా ప్రేమకథలను ప్రయత్నించడం ఆయన వల్లే అవుతుంది. అందుకే ఆయన రియల్ కింగ్.. అమేజింగ్ నాన్న. అంతేకాదు మాకు హిట్ వస్తే అదే ప్యాట్రన్ లో సినిమాలు చేసి సేఫ్టీ చూసుకుంటాం కాని నాన్న అలా కాదు హిట్టొచ్చినా.. ఫ్లాప్ వచ్చినా ప్రతి స్టెప్ ధైర్యంగా వేస్తుంటారని నాగ చైతన్య అన్నారు.