40 కోట్ల ఆఫర్ నో చెప్పాడా..!

యువ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ రిలెజ్ట్ కొంత ఆలోచనలో పడేసింది. భరత్ కమ్మ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజైంది. మొదటిరోజు మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించేందుకు కుస్తీ పడుతుంది. ఈ సినిమా రిలీజ్ ముందే హింది రీమేక్ రైట్స్ భారీ మొత్తానికి కొన్నారు కరణ్ జోహార్.

బాలీవుడ్ లో కూడా విజయ్ తోనే ఈ సినిమా చేయాలని అనుకున్నారట. అందుకు విజయ్ కు 40 కోట్ల దాకా ఆఫర్ చేశారని టాక్. అయినా సరే విజయ్ దేవరకొండ అందుకు ఒప్పుకోలేదని తెలుస్తుంది. తెలుగులో ఒకసారి నటించిన సినిమాలో మళ్లీ నటించడం తనకు ఇష్టం ఉండదని చెప్పాడు విజయ్. అందుకే అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ లో విజయ్ స్థానంలో షాహిద్ కపూర్ నటించాడు. ఒకవేళ తను హిందిలో చేయాల్సి వస్తే తెలుగు, హింది భాషల్లో బైలింగ్వల్ చేస్తానని అన్నాడు విజయ్ దేవరకొండ.