సాహో తర్వాత పెళ్లేనా..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. బాహుబలి తర్వాత ఇక పెళ్లే అనుకోగా.. ప్రభాస్ పెళ్లి అప్పుడు ఇప్పుడు అంటూ చెప్పడమే తప్ప జరిగిందేమి లేదు. ఇక ఇప్పుడు సాహో రిలీజ్ దగ్గర పడుతుండగా సాహో తర్వాత అయినా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేదా అన్న డౌట్ మొదలైంది. సాహో తర్వాత ప్రభాస్ పెళ్లి కన్ఫాం అని తెలుస్తుంది.   

ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కొంతమందిని సెలెక్ట్ చేశారట. ప్రభాస్ చూసి వారిలో ఒకరిని ఫైనల్ చేయడమే అని తెలుస్తుంది. సాహో రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి మ్యాటర్ కన్ఫాం చేస్తాడట. ఇక జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న జాను సినిమా రిలీజ్ తర్వాత పెళ్లి చేసుకుంటాడట. సాహో తర్వాత ప్రభాస్ పెళ్లిపై ఓ పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుందని తెలుస్తుంది. మరి ప్రభాస్ మనసు గెలిచే ఆ యువరాణి ఎవరో చూడాలి.