అనసూయ 'కథనం' ట్రైలర్

యాంకర్ గా సూపర్ ఫాంలో ఉన్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతుంది. క్షణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనసూయ క్రేజీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అనసూయ కథనం సినిమాలో నటించింది. రాజేష్ నాదెండ్ల డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయ సినిమా దర్శకురాలిగా కనబడుతుంది. ఆగష్టు 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజైంది. 

తను రాసుకున్న కథలానే వరుస హత్యలు జరుగుండటం వల్ల పోలీసులు అనసూయని అనుమానిస్తారు. అసలు అనసూయకు ఈ హత్యలకు సంబంధం ఏంటి అన్నదే కథనం సినిమా. కింగ్ నాగార్జున మన్మథుడు 2 సినిమాకు పోటీగా అనసూయ కథనం రిలీజ్ అవుతుంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండగా అనసూయ కథనం ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.