'ది బోల్డ్' రాశి ఖన్నా

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఆ తర్వాత క్రేజీ సినిమాల్లో నటించింది. యువ హీరోల సరసన నటించి మెప్పించిన రాశి ఖన్నా ఈమధ్య బొద్దుగా ఉన్న కామెంట్స్ బాగా వినపడటంతో కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి తన లుక్ చేంజ్ చేసుకుంది. డైటింగులు గట్రా బాగా చేసినట్టున్న అమ్మడు ఇప్పుడు తన స్లిమ్ లుక్ తో సర్ ప్రైజ్ ఇస్తుంది. బొద్దుగా ఉన్నప్పుడు దాచుకున్న తన అందాలను ఇప్పుడు బహిర్గతం చేస్తుంది రాశి ఖన్నా .

లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ లో ఓ బోల్డ్ పిక్ ఒకటి షేర్ చేసింది అమ్మడు. ఇండియా హెల్త్ కేర్ మేగజైన్ కోసం అమ్మడు ఇచ్చిన ఫోటో షూట్ కుర్రాళ్ల హృదయాలను గిలిగింతలు పెడుతుంది. ఇన్నాళ్లు రాశి ఖన్నాలో ఈ యాంగిల్ గుర్తించని ప్రేక్షకులు ఈ పిక్ చూసి షాక్ అవుతున్నారు. బోల్డ్ లుక్ లో రాశి అదరగొడుతుండగా.. సరైన ఛాన్స్ రావాలే కాని తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకుంటా అని చెబుతుంది. ప్రస్తుతం వెంకీమామ, సాయి ధరం తేజ్ ప్రతిరోజు పండుగ సినిమాల్లో నటిస్తుంది రాశి ఖన్నా. స్లిమ్ గా మారాక గ్లామర్ షోకి అడ్డు చెప్పట్లేదని తెలుస్తుంది.