బాహుబలి కంటే ముందే కథ చెప్పా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. ఆగష్టు 30న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో భాగంగా డైరక్టర్ సుజిత్ మీడియాతో మాట్లాడారు. బాహుబలి రిలీజ్ కు ముందే ప్రభాస్ కోసం ఈ కథ సిద్ధం చేసుకున్నానని బాహుబలి తర్వాత సెట్స్ మీదకు వెళ్లినా కథలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పాడు సుజిత్.

ప్రభాస్ కోసం మాత్రమే తాను 5 ఏళ్లు వెయిట్ చేశానని.. వేరే హీరో కోసం చేస్తానని మాత్రం చెప్పలేనని అన్నాడు సుజిత్. బాహుబలి రేంజ్ సినిమా కాకున్నా సాహో డిఫరెంట్ మూవీ అని.. తప్పకుండా ఆడియెన్స్ కు థ్రిల్ కలిగిస్తుందని అన్నారు సుజిత్. ఈ సినిమా కథ బాగా రావడం వల్ల తనకు రెండో సినిమా అయినా అనుభవం ఉన్న టెక్నిషియన్స్ వల్ల సినిమా బాగా వచ్చిందని అన్నారు సుజిత్. రిలీజైన సాహో టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా సినిమా ఆ రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.