సరిలేరు నీకెవ్వరు.. హిలేరియస్ ట్రైన్ జర్నీ..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతుందట. ఈ విషయాన్నే వెళ్లడిస్తూ డైరక్టర్ అనీల్ రావిపుడి ఓ స్పెషల్ ట్వీట్ వేశాడు. సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.. 2020  సంక్రాంతి థియేటర్లలో ఒక హిలేరియస్ ట్రైన్ జర్నీని చూడబోతున్నారు.. సూపర్ స్టార్ మహేష్ గారు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కు సిద్ధంగా ఉండండి #సరిలేరు నీకెవ్వరు అంటూ అనీల్ రావిపుడి ట్వీట్ చేశాడు.

అంతేకాదు మహేష్ ట్రైన్ లో డోర్ దగ్గర నిలబడిన ఓ పిక్ షేర్ చేశాడు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి మహేష్ తో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహర్షితో సూపర్ హిట్ అందుకున్న మహేష్ సరిలేరు నీకెవ్వరుతో మరో సెన్సేషన్ కు సిద్ధమయ్యాడు. ఖలేజా, దూకుడు, ఆగడు తర్వాత కామెడీ ఎంటర్టైనర్ సినిమాలకు దూరంగా ఉన్న మహేష్ సరిలేరు నీకెవ్వరుతో మళ్లీ ఆ ప్రయత్నం చేస్తున్నాడు.