
ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల ఈరోజు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స జరుగుతున్న సమయంలోనే తుది శ్వాస విడిచారు. తన యాక్టింగ్ స్కూల్ లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన దేవదాస్ కనకాల ప్రస్తుతం స్టార్స్ గా ఉన్న వారందరికి నటనలో శిక్షణ ఇచ్చారు.
సౌత్ సూపర్ హీరోస్ రజినికాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, భానుచందర్, రఘువరణ్ లకు నటనా శిక్షణ ఇచ్చారు దేవదాస్ కనకాల. ఇప్పటికి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో వర్ధమాన నటులకు శిక్షణ ఇస్తున్నారు దేవదాస్ కనకాల. దేవదాస్ కనకాల మరణ వార్త విన్న టాలీవుడ్ షాక్ కు గురైంది. ఈమధ్యనే తల్లి లక్ష్మి దేవి కనకాలను పోగొట్టుకున్న రాజీవ్ కనకాల ఇప్పుడు తండ్రిని కోల్పోయాడు.