
బయోపిక్ సినిమాల హవా కొనసాగుతున్న తెలుగు సిని పరిశ్రమలో ఇప్పుడు ఓ విధ్యార్ధి విప్లవ నాయకుడి జీవిత కథ కూడా తెరకెక్కుతుంది. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా విధ్యార్ధి విప్లవ నాయకుడిగా అందరికి ఆదర్శంగా నిలిచిన జార్జ్ రెడ్డి జీవిత కథతో సినిమా వస్తుంది. చరిత్ర మరచిపోయిన జార్జ్ రెడ్డి జీవిత కథతో అదే టైటిల్ తో సినిమా వస్తుంది. 1960, 70 కాలంలో ఉస్మానియాలో చదివిన విధ్యార్ధులను ఎవరిని అడిగినా జార్జ్ రెడ్డి గురించి చెబుతారు.
సమ సమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్ రెడ్డిని ఉస్మానియా క్యాంపస్ లోనే దారుణంగా హత్య చేశారు. హైదరాబాద్ చేగువేరాగా పిలిచే జార్జ్ రెడ్డి జీవిత కథను.. అప్పటి రాజకీయ పరిస్థితులను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు. దళం సినిమాతో దర్శకుడిగా మెప్పించిన జీవన్ రెడ్డి జార్జ్ రెడ్డి సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు దర్శక నిర్మాతలు. మైక్ మూవీస్ అప్పిరెడ్డి సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.