
కోలీవుడ్ స్టార్ హీరో.. విలక్షణ నటుడు చియాన్ విక్రం మరో సాహసానికి సిద్ధమయ్యారు. కెరియర్ లో 57 సినిమాల్లో నటించి మెప్పించిన విక్రం 58వ సినిమాగా అజయ్ జ్ఞానముత్తు డైరక్షన్ లో చేస్తున్నారు. ఈ సినిమాలో ఒకటి రెండు కాదు ఏకంగా 25 డిఫరెంట్ గెటప్పులలో కనిపిస్తాడట విక్రం. ఒక్క సినిమాలో 25 గెటప్పులా కచ్చితంగా ఇది ప్రపంచ సినిమాలోనే ఓ సరికొత్త రికార్డ్ అని చెప్పొచ్చు.
కమల్ హాసన్ తర్వాత అలా ప్రయోగాలకు తాను ఎప్పుడూ సిద్ధమని చెప్పే విక్రం. 25 పాత్రల్లో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2020 ఏప్రిల్ లో రిలీజ్ చేస్తారట. 7 స్క్రీన్ స్టూడియోస్, వయకామ్ 18 స్టూడియోస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. తమిళంలో తీస్తున్నా తెలుగు, హింది భాషల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈమధ్య కాలంలో ప్రయోగాలైతే చేస్తున్నా సక్సెస్ కు దూరంగా ఉన్న విక్రం ఈ సినిమాతో అయినా సత్తా చాటుతాడేమో చూడాలి.